close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. రాజ్‌భవన్‌ ర్యాలీకి అనుమతి నిరాకరణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌ నిరసన బాటపట్టింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు కాంగ్రెస్‌ శ్రేణులు ప్రదర్శనగా బయల్దేరారు. అనంతరం గవర్నర్‌ తమిళిసైను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే కాంగ్రెస్‌ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్‌ నుంచి వారు బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసు వలయాన్ని నెట్టుకొని ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు యత్నించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విమర్శలకు తావిచ్చేలా వ్యవహరించడం తగదు

సభాపతి ఆటలో రిఫరీ లాంటి వారని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. సభానాయకుడిని ఏ విధంగా గౌరవిస్తారో, ప్రతిపక్ష నాయకుడిని అంతే సమానంగా గౌరవించాలని ఆయన అన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడడం తగదని యనమల విమర్శించారు. స్పీకర్‌ స్థానానికి ఉన్న గౌరవాన్ని తగ్గించే విధంగా పక్షపాత ధోరణితో తమ్మినేని మాట్లాడుతున్నారని యనమల దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధికి అధికార పక్షం ఎంత ముఖ్యమో, ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రైవేటుకు అనుమతిపై విచారణ వాయిదా

తెలంగాణ ఆర్టీసీలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. టీఎస్‌ఆర్టీసీలో ప్రైవేటు బస్సులకు అనుమతిస్తూ రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తెజస ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ విషయంలో మంత్రివర్గ నిర్ణయాలను తమ ముందుంచాలని ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అలా జరిగితే మాతృ భాష ఉనికికే ప్రమాదం

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఆపడం మాతృభాష ఉనికికే ప్రమాదమని తెదేపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ ఆక్షేపించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ మాధ్యమం కావాలో ఎంపిక చేసుకునే  స్వేచ్ఛను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వదిలేయాలని ఆయన అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పనులు ఆగిపోయాయని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీజేఐతో యూపీ ఉన్నతాధికారుల భేటీ

అయోధ్య స్థల వివాదంపై త్వరలో తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఉత్తరప్రదేశ్‌ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతలపై ఆయన వారితో చర్చించారు. యూపీ సీఎస్‌ రాజేంద్ర కుమార్‌తివారీ, డీజీపీ ఓం ప్రకాశ్‌ సింగ్‌లను తన ఛాంబర్‌కు సీజేఐ పిలిచారు. దేశంపై, దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే ఈ చారిత్రక తీర్పు నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఆయన సమీక్షించనున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సీఎం పదవి ఇస్తేనే సంప్రదింపులు: శివసేన

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై భాజపా, శివసేన మధ్య ఏర్పడ్డ చిక్కుముడి ఇంకా వీడడం లేదు. ఇరు పార్టీల మధ్య నెలకొన్న మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. శివసేన ప్రముఖ నేత సంజయ్‌ రౌత్‌ శుక్రవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనుకోవడం ప్రజల్ని అగౌరపరచడమేనని అభిప్రాయపడ్డారు. సీఎం పదవి శివసేనకు ఇచ్చేందుకు సమ్మతమయితేనే తమ పార్టీని సంప్రదించాలని భాజపాకు తేల్చి చెప్పారు. అపద్ధర్మ ప్రభుత్వం పేరుతో భాజపా అధికార దుర్వినియోగం చెయ్యొద్దన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. హెచ్‌1-బీవీసా దరఖాస్తు రుసుము పెంపు

ఇప్పటికే హెచ్‌ 1 బీ వీసాల జారీ నిబంధనలను కఠినతరం చేసిన అమెరికా.. దరఖాస్తు రుసుమును కూడా పెంచింది.  హెచ్‌1 బీ వర్క్‌ వీసా దరఖాస్తు రుసుమును 10 డాలర్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. వీసా ఎంపిక విధానాన్ని ఆధునీకరించే ప్రయత్నాలలో ఈ పెంపుదల ఒక భాగమని అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ సేవల విభాగం (యు.ఎస్‌.సి.ఐ.ఎస్) తెలియజేసింది. హెచ్‌-1 బీ క్యాప్‌ సెలక్షన్‌ విధానాన్ని మరింత సమర్థవంతం చేయడానికి ఎలక్ర్టానిక్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని అవలంభిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌కు మూడీస్‌ మరోసారి షాక్‌

‘మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్సీస్‌’ భారత్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను తగ్గించింది. ఇప్పటి వరకు ‘స్టేబుల్‌’గా ఉన్న ఆర్థిక వ్యవస్థని ప్రస్తుతం ‘నెగటివ్‌’కి చేర్చింది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని తెలిపింది. ఆర్థిక, సంస్థాగత బలహీనతల్ని పరిష్కరించడంలో మూడీస్‌ అంచనా వేసిన దానికంటే ప్రభుత్వం నెమ్మదిగా స్పందిస్తోందని సంస్థ అభిప్రాయపడింది. ఇదిలాగే కొనసాగితే ఇప్పటికే తీవ్ర స్థాయికి చేరుకున్న అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘ట్రంప్‌.. 2 మిలియన్‌ డాలర్లు చెల్లించు’

రెండు మిలియన్‌ డాలర్లు స్వచ్ఛంద సంస్థలకు చెల్లించాలని న్యూయార్క్‌ కోర్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ని ఆదేశించింది. నిజానికి ఇది ఆయనకు ఓ రకంగా జరిమానా లాంటిదనే చెప్పాలి! ఆయన ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘ట్రంప్‌ ఫౌండేషన్‌’కు వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారని న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ జేమ్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిధుల్ని వాడుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఒడిశా: దంతాలు శుభ్రం..రికార్డు సొంతం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.