close

తాజా వార్తలు

బోధి వృక్షం నుంచి నీటి ప్రవాహం

గరియాబంద్‌ : బోధి వృక్షం నుంచి జలధారలు ప్రవహిస్తున్న విచిత్ర సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ జిల్లాలో జరిగింది. స్థానికంగా ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజా పన్నుల విభాగం కార్యాలయ ఆవరణలో ఈ చెట్టు ఉంది. భూమి నుంచి రెండు అడుగుల ఎత్తున ఈ వృక్షానికి ఉన్న చిన్న రంధ్రం నుంచి నీరు జాలువారుతోంది. అయితే దీని నుంచి వస్తున్న నీరు జిల్లాలోని పైరీ నదికి అనుసంధానించిన భూగర్భ పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా వచ్చి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. అధ్యాత్మికవాదులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఇదంతా దేవుని మహిమ వల్లే సాధ్యమని నమ్ముతున్నారు. భూగర్భ పైప్‌లైన్‌ లీకేజీ కావడం సాధ్యం కాదని వారు వాదిస్తున్నారు. మరో వైపు ఈ సంఘటనపై స్పందించడానికి పీడబ్ల్యూడీ, పీహెచ్‌పీ అధికారులు నిరాకరించారు. సాలు వృక్షాన్ని శాస్త్రీయంగా సోరియా రొబస్టా అంటారు. భారత దేశ అధ్యాత్మిక రంగంలో దీనికి విశిష్ట స్థానం ఉంది. విష్ణువు ఈ వృక్షంపై కొలువుదీరి ఉంటాడని హిందువులు విశ్వసిస్తారు. జైనతీర్థంకరుడు, మహావీరుడు ఇదే బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందారు.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.