close

తాజా వార్తలు

పార్క్‌లో ఒళ్లుగగుర్పొడిచే ప్రమాదం 

ముగ్గురి మృతి..పలువురికి తీవ్రగాయాలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న కంకారియా అడ్వెంచర్‌ పార్క్‌లో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటుచేసుకుంది. ఓ జాయ్‌ రైడ్‌ ఎక్కి పలువురు ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పైప్‌ విరిగిపోవడంతో పైదాకా వెళ్లిన రైడ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో రైడ్‌లో 30 మంది ఉన్నారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో రికార్డ్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటనపై చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ దస్తూర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘రైడ్‌లో 32 సీట్లు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ప్రధాన పైప్‌ విరిగిపోవడంతో అది కుప్పకూలింది. పైప్‌ ఎలా ఊడిపోయిందన్న ఘటనపై ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలిస్తున్నారు’ అని తెలిపారు. ఈ ఘటనకు కారకులైనవారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. మరోపక్క ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. కారకులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.