Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 134251
            [news_title_telugu_html] => 

ఉన్నావ్‌ ప్రమాదంపై ప్రకంపనలు

[news_title_telugu] => ఉన్నావ్‌ ప్రమాదంపై ప్రకంపనలు [news_title_english] => Opposition Corners Government Over Unnao incident [news_short_description] => ఉన్నావ్‌ బాధితురాలి రోడ్డు ప్రమాద ఘటన ఇప్పుడు పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తోంది. [news_tags_keywords] => Unnao,Adhir Ranjan Chowdhury,loksabha,Kuldeep Sengar [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-31 00:11:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఉన్నావ్‌ ప్రమాదంపై ప్రకంపనలు - Opposition Corners Government Over Unnao incident - EENADU
close

తాజా వార్తలు

ఉన్నావ్‌ ప్రమాదంపై ప్రకంపనలు

 

దిల్లీ:  ఉన్నావ్‌ బాధితురాలి రోడ్డు ప్రమాద ఘటన ఇప్పుడు పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార పక్షం భాజపా లక్ష్యంగా విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అత్యాచార ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎమ్మెల్యే, నిందితుడు కుల్‌దీప్‌ సింగ్ సెనగర్‌‌..బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల్ని హతమార్చేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ఆదివారం రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుందని  ఆరోపిస్తున్నాయి. దీనిపై నిష్పాక్షిక విచారణ జరపాలని, హోం మంత్రి అమిత్‌ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.

దీనిపై కాంగ్రెస్‌ లోక్‌సభా పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరీ సభలో మాట్లాడుతూ..‘ఉన్నావ్‌ ఘటనను దేశ ప్రజలు అవమానంగా భావిస్తున్నారు. ఒక మైనర్‌ బాలికపై అత్యాచారం జరగడం నాగరిక సమాజంలో మాయని మచ్చ. ఎలాంటి సమాజం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీనిపై హోంమంత్రి సభకు వచ్చి, వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి విపక్షాలకు సూచించారు. ఇప్పటికే సీబీఐ విచారణ కొనసాగుతోందని, ఎఫ్‌ఐఆర్ నమోదైందని తెలిపారు. ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా ప్రభుత్వం విచారణ జరుపుతుందని వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘కుల్‌దీప్‌ సెనగర్ వంటి వ్యక్తులకు ఎందుకు అండదండలు కల్పిస్తున్నాం, ఎందుకు వారి బాధితులను ఒంటరిగా పోరాడేలా వదిలేశాం? బాధిత కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని ఎఫ్ఐఆర్‌లో స్పష్టంగా ఉంది. వారి ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా దానిలో పేర్కొన్నారు’ అని ఆమె ట్వీట్ చేశారు. ఈ రోడ్డు ప్రమాదానికి సెనగర్‌, ఆయన అనచరులు కారకులని ఆరోపిస్తూ సోమవారం ఎఫ్ఐఆర్‌ నమోదైన సంగతి తెలిసిందే. 

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది.  ప్రమాదం జరిగిన దగ్గరి నుంచి ఆమె స్పృహలోకి రాలేదని, వెంటిలేటర్‌ మీద చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావం జరగుతుందని, తల, కాళ్లకు చాలా చోట్ల గాయాలయ్యాయని పేర్కొన్నారు. మరో 48 గంటల వరకు ఏ విషయమూ చెప్పలేమని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.