Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145674
            [news_title_telugu_html] => 

ఆయన పారిపోవడం కాంగ్రెస్‌కు సిగ్గుచేటు

[news_title_telugu] => ఆయన పారిపోవడం కాంగ్రెస్‌కు సిగ్గుచేటు [news_title_english] => BJP Hits Out At Congress Over P Chidambaram case [news_short_description] => కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం అరెస్టు నుంచి తప్పించుకొని, పారిపోవడంపై భాజపా తీవ్ర విమర్శలు చేసింది. [news_tags_keywords] => P Chidambaram,Congress,BJP [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 20:32:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆయన పారిపోవడం కాంగ్రెస్‌కు సిగ్గుచేటు - BJP Hits Out At Congress Over P Chidambaram case - EENADU
close

తాజా వార్తలు

ఆయన పారిపోవడం కాంగ్రెస్‌కు సిగ్గుచేటు

మాల్యా, నీరవ్‌ జాబితాలో చిదంబరం చేరాలనుకుంటున్నారు

దిల్లీ: కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం అరెస్టు నుంచి తప్పించుకొని, పారిపోవడంపై భాజపా తీవ్ర విమర్శలు చేసింది. ఒక సీనియర్‌ నేత ఈ విధంగా వ్యవహరించడంపై కాంగ్రెస్‌ పార్టీ సిగ్గుపడాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఐఎన్ఎక్స్‌ మీడియా కేసులో దిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ నిరాకరించడంతో దర్యాప్తు సంస్థలు ఆయన్ను అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నించగా, వారికి దొరక్కుండా తప్పించుకున్నారు. దాంతో ఆయన మీద లుక్‌అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. దర్యాప్తు సంస్థల అధికారాలను దుర్వినియోగపరిచి భాజపా విపక్ష నేతలను హింసిస్తుందన్న విపక్షాల విమర్శలపై  బుధవారం భాజపా స్పందించింది. 

‘విజయ్‌ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారి జాబితాలో చిదంబరం చేరాలనుకుంటున్నారు. ఈ ఆర్థిక నేరాన్ని తీవ్రంగా పరిగణించి, దృష్టి సారించాం. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది’ అని అధికార పార్టీ స్పష్టం చేసింది. పారిశ్రామిక వేత్తలైన మాల్యా, నీరవ్ వేల కోట్లు రూపాయలు బ్యాంకులను మోసగించి విదేశాలు పారిపోయిన సంగతి తెలిసిందే.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.