close

తాజా వార్తలు

ఈ తరంలో కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ తరంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ ట్వీట్‌ చేశాడు. బంగ్లాదేశ్‌తో చారిత్రక డేనైట్‌ టెస్టు సందర్భంగా కోహ్లీ(136) పింక్‌ బాల్‌తో 27వ శతకం బాదిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాన్‌ ట్వీట్‌ చేస్తూ అతడిని ప్రశంసించాడు. ‘రెడ్‌ బాల్‌, వైట్‌ బాల్‌, ఇప్పుడు పింక్‌ బాల్‌. ఈ తరంలో అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ కోహ్లీనే’ అని పేర్కొన్నాడు. 

ఈ ఇన్నింగ్స్‌తో విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా టెస్టుల్లో 20వ శతకం పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ ఫార్మాట్‌లో వేగంగా 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న కెప్టెన్‌గా నిలిచాడు. రికీ పాంటింగ్‌ ఆసీస్‌ కెప్టెన్‌గా 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా కోహ్లీ 86 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకున్నాడు. మరోవైపు టీమిండియా బంగ్లాతో ఆడుతున్న రెండో టెస్టులో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. మరో నాలుగు వికెట్లు తీస్తే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.