close

తాజా వార్తలు

విశాల్‌ పెళ్లిపై వదంతులు

 

కోడంబాక్కం, న్యూస్‌టుడే: నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్‌ పెళ్లికి సంబంధించి కోలీవుడ్‌లో పలురకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ అమ్మాయి ఫొటో పెట్టి.. ఆంధ్రకు చెందిన ఈ అమ్మాయినే విశాల్‌ పెళ్లాడనున్నారని కొన్ని పత్రికలు, వెబ్‌సైట్లు వార్తలు ప్రచురించాయి. దీన్ని చూసి ఆశ్చర్యపోవడం విశాల్‌ వంతైంది. ఈ వార్తలు మరింత ఎక్కువ కావడంతో విశాల్‌ సన్నిహిత వర్గాలు స్పందించాయి. విశాల్‌ పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ సత్యదూరమని పేర్కొన్నాయి. అధికారికంగా ప్రకటన వచ్చే వరకు పెళ్లికి సంబంధించిన వార్తలు దయచేసి ప్రచురించవద్దని కోరాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.