close

తాజా వార్తలు

150 మిలియన్‌ యూజర్ల పాస్‌వర్డ్‌ల రీసెట్‌..

దిల్లీ : ప్రముఖ న్యూస్‌ అగ్రిగేటర్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ఫ్లిప్‌బోర్డ్‌ కష్టాల్లో పడింది. ఆ సంస్థపై  హ్యాకర్లు దాడి చేసి దాదాపు 150 మిలియన్‌ యూజర్ల సమాచారాన్ని తస్కరించారు. దీంతో ఆ సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వినియోగదారుల పాస్‌వర్డ్‌లను రీసెట్‌ చేసి.. కొత్త పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాల్సిందిగా ఆ సంస్థ సూచించింది.

గతేడాది జూన్‌ 2 నుంచి ఈ ఏడాది మార్చి 23 వరకు, ఈ ఏడాది ఏప్రిల్‌ 21-22ల మధ్య హ్యాకర్లు ఫ్లిప్‌బోర్డు వినియోగదారుల సమాచారాన్ని  పొందారని సంస్థ భావిస్తోంది. యూజర్‌నేమ్స్‌‌, పాస్‌వర్డ్‌లు,ఈమెయిల్‌ ఐడీలలాంటి సున్నితమైన సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కింది.
 
దీంతో 150 మిలియన్‌ యూజర్ల పాస్‌వర్డ్‌లను ఆ సంస్థ రీసెట్‌ చేసింది. వెంటనే కొత్త పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాల్సిందిగా సూచించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.