
తాజా వార్తలు
శాన్‌ఫ్రాన్సికో: మానవ హక్కులను ఉల్లంఘిస్తూ, వలసదారుల పట్ల యూఎస్ ఇమిగ్రేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వందలాది గూగుల్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇమిగ్రేషన్ అధికారులతో కలిసి పనిచేయరాదని దాదాపు 600మంది గూగుల్ ఉద్యోగులు సంతకాలతో కూడిన పిటిషన్‌ను కంపెనీ అధికారులకు సమర్పించారు. యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ)తో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు సంబంధించి ఎలాంటి ఒప్పందం చేసుకోవద్దని వారు గూగుల్‌ను కోరారు.
ప్రస్తుతం గూగుల్‌తో పాటు, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందిస్తున్నాయి. ‘అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చింది. సీబీపీతో గూగుల్ చేసుకునే ఏ ఒప్పందానికి సంబంధించిన పనినీ మేము చేయబోం’ అని ఉద్యోగులు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, దీనిపై గూగుల్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వలసలకు సంబంధించిన వ్యవహరాల విషయంలో ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎలాంటి సహాయం లభించడం లేదని గూగుల్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ‘చరిత్ర స్పష్టంగా ఉంది. ఇది ఇలాంటివి కుదరదు అని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.’ అని గూగుల్ ఉద్యోగులు తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
