close

తాజా వార్తలు

‘భారత లక్కీ ఛార్మ్ నేనే‌’

సోనమ్‌ కపూర్‌

ముంబయి: బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘జోయా ఫ్యాక్టర్‌’. ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్ కథానాయకడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అభిషేక్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను సోనమ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘జోయా సోలంకి ఉండగా ఎవరికి నిమ్మకాయ, మిర్చి కావాలి! భారత లక్కీ ఛార్మ్‌ నేనే’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో సోనమ్‌ అమ్మవారిలాగా తయారై ఒక చేతిలో హెల్‌మెట్‌తో మరో చేతిలో బ్యాట్‌ పట్టుకుని నవ్వుతూ కనిపించారు. 2011 వరల్డ్‌ కప్‌ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.