
తాజా వార్తలు
న్యూదిల్లీ: జమ్మూకశ్మీర్ పర్యటనకు యూరోపియన్ యూనియన్‌కు చెందిన ప్రతినిధుల బృందానికి అనుమతివ్వడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. దేశానికి చెందిన రాజకీయ నేతలను అక్కడకు వెళ్లకుండా అడ్డుకుని.. విదేశీ ప్రతినిధులను మాత్రం ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది. ఇది పార్లమెంట్‌ను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌చేశారు.
‘‘దేశానికి చెందిన రాజకీయ పార్టీల నేతలను జమ్మూకశ్మీర్ వెళ్లకుండా, అక్కడి ప్రజలతో మాట్లాడకుండా అడ్డుకుని ఈయూ ప్రతినిధులకు అనుమతించడమేంటి? సొంత పార్లమెంట్‌ను, ప్రజాస్వామ్యాన్ని ఇది ముమ్మాటికీ అవమానించడమే’’ అని జైరాం రమేశ్ ట్వీట్‌చేశారు. ‘చెస్ట్ బీటింగ్ ఛాంపియన్ ఆఫ్ నేషనలిజమ్’ అంటూ ప్రధానిపై పరోక్షంగా విమర్శలు చేశారు.
25మందితో కూడిన ఈయూ ప్రతినిధుల బృందం ప్రధాని మోదీని కలిసింది. ఈ బృందం జమ్మూకశ్మీర్‌లో మంగళవారం పర్యటించనుంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం నెలకొన్న పరిస్థితులను వారు తెలుసుకోనున్నారు. అంతకుముందు జమ్మూకశ్మీర్‌లో ప్రతిపక్ష పార్టీ నేతల పర్యటనపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో కాంగ్రెస్ తాజాగా విమర్శలు గుప్పిస్తోంది. ‘‘ఈయూ ప్రతినిధులు కశ్మీర్ వెళతామంటే భాజపా గౌరవిస్తుంది. అదే ప్రతిపక్ష నేతలు వెళితే అడ్డుకుంటుంది. స్వదేశీయులు వెళ్లాలంటే సుప్రీం తలుపు తట్టాలి. ఈయూ నేతలకు పీఎంవోనే స్వాగతం పలుకుతుంది’ అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ విమర్శించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- కొడితే.. సిరీస్ పడాలి
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
