close

తాజా వార్తలు

రంగులు నింపితే... ఒత్తిడి పరార్‌!

చదువుల భారం, పనిఒత్తిడి, కుటుంబ సమస్యలు...కారణాలు ఏవైనా చాలామందిని ఒత్తిడి వేధిస్తుంది. ఇలాంటివారు దాన్నుంచి త్వరగా బయటపడాలంటే...  ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.
* ఒత్తిడిగా ఉందా... కాసేపు చిన్నపిల్లలైపోయి వారితో కలిసి పచ్చటిగడ్డిలో ఆటలాడండి. చెప్పులు లేకుండా నడిస్తే...గడ్డి నరాలకి తగిన మర్దన అందిస్తుంది. దాంతో ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది.
* క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌... అదేనండీ పదవినోదం తెలుసుగా! కాసేపు వాటిని ప్రయత్నించండి. మనసుకు ఊరటగా ఉంటుంది. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు గుర్తుకురాకుండా ఉంటాయి.
* పిల్లలు బొమ్మల్లో రంగులు నింపుతూ ఎంత ఆనందంగా ఉంటారో కదా! మీరూ ఒత్తిడిగా ఉన్నప్పుడు అదే చేయండి. ఆ వర్ణాలు మీ మనసుని కాసేపు పక్కకి మళ్లించి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.  
* గోరువెచ్చని నీళ్లల్లో రెండు చుక్కల లావెండర్‌ నూనె కలపండి. ఇది ఒళ్లునొప్పులు, ఒత్తిడి లేకుండా చేస్తుంది. లేదంటే మార్కెట్‌లో దొరికే స్ట్రెస్‌ బంతిని తీసుకుని దాంతో కాసేపు వ్యాయామం చేసినా మంచిదే. హాయిగా అనిపిస్తుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.