close
పాస్‌పోర్టు ర్యాంకులు.. భారత్‌ స్థానమెంత?

దిల్లీ: ప్రపంచ పాస్‌పోర్టు ర్యాంకుల్లో భారత్‌ 84వ స్థానంలో నిలిచింది. ‘ప్రపంచ అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టులు’ పేరిట హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ 2020 సంవత్సరానికి ఈ ర్యాంకులు ప్రకటించింది. ఈ జాబితాలో భారత్‌ 58 స్కోరుతో మౌరిటానియా, తజకిస్థాన్‌ దేశాలతో 84వ ర్యాంకును పంచుకుంది. ముందస్తు వీసా లేకుండా 58 దేశాల్లో పర్యటించొచ్చని ఈ స్కోరు సూచిస్తుంది. గతేడాది పోలిస్తే భారత్‌ 2 స్థానాలు దిగజారడం గమనార్హం.

ఇక ఈ జాబితాలో జపాన్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్టుతో ఏకంగా 191 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించొచ్చు. అమెరికా, యూకే ఈ జాబితాలో ఎనిమిదో ర్యాంకులో నిలిచాయి. అఫ్గానిస్థాన్‌ పాస్‌పోర్టు చిట్టచివరి స్థానంలోనూ.. పాకిస్థాన్‌ చివరి నుంచి నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో సింగపూర్‌ (190 దేశాల్లో పర్యటించే వీలు).. జర్మనీ, దక్షిణ కొరియా (189), ఫిన్లాండ్‌, ఇటలీ (188), డెన్మార్క్‌, లగ్జెంబర్గ్‌, స్పెయిన్‌ (187) టాప్‌-5లో నిలిచాయి.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.