close
తాడేపల్లి చేరుకున్న జగన్‌

ఓట్ల లెక్కింపు సరళిని స్వగృహం నుంచి పర్యవేక్షించనున్న వైకాపా అధ్యక్షుడు

ఈనాడు, అమరావతి: వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. గురువారం ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఉదయం నుంచే పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌ నుంచి ఆయన సతీమణి వైఎస్‌ భారతితో కలిసి వచ్చారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ గురువారం ఉదయం తాడేపల్లికి రానున్నారు. బుధవారం జగన్‌తో పాటు వైకాపా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కూడా వచ్చారు. ఓట్ల లెక్కింపు సరళిని వీరిద్దరూ తాడేపల్లి నుంచే పార్టీ అభ్యర్థులు, నేతలతో సమీక్షించనున్నారు. మరోవైపు పరిస్థితులన్నీ వైకాపాకు అనుకూలంగా ఉన్నాయని జగన్‌ నివాసం వద్ద నేతలు ధీమా వ్యక్తం చేశారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్‌కు స్వాగతం అంటూ తాడేపల్లిలో ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్‌ నివాసాల వద్ద పోలీసులు భద్రత పెంచారు. బారికేడ్లు ఏర్పాటు చేసి, జనం లోపలికి చొచ్చుకు వెళ్లకుండా నివారించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.