స్థానికంపై కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలి:చంద్రబాబు

తాజా వార్తలు

Updated : 18/11/2020 11:09 IST

స్థానికంపై కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలి:చంద్రబాబు

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత ప్రక్రియను పూర్తి రద్దు చేసి మళ్లీ తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌ నామినేషన్లకు అనుమతించి కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల ప్రక్రియలో వైకాపా బెదిరింపులకు పాల్పడి తప్పుడు కేసులు పెట్టి బలవంతంగా నామినేషన్లు ఉపసంహరణ చేయించిందని ఆరోపించారు. ఆ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఎస్‌ఈసీ ఎదుట పార్టీలు ఇదే అభిప్రాయాలను వెల్లడించాయని గుర్తు చేశారు. మరోవైపు పోలవరం అంశంపై మాట్లాడుతూ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అవినీతి డబ్బు పంపకాల్లో తేడాలు వచ్చి వైకాపా నేతలు రోడ్డెక్కి కొట్టుకుంటూ చంపుకొనేదాకా వెళ్తున్నారని.. సీఎం జగనే స్వయంగా పంచాయతీలు చేసి వాటాలు కుదుర్చుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. త్వరలో జరగనున్న  తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికలో వైకాపాకు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని