ఆ హామీ నెరవేర్చకపోతే దీక్ష చేస్తా:జగ్గారెడ్డి

తాజా వార్తలు

Published : 07/09/2020 01:06 IST

ఆ హామీ నెరవేర్చకపోతే దీక్ష చేస్తా:జగ్గారెడ్డి

హైదరాబాద్‌: ప్రజాసమస్యలపై అసెంబ్లీలో గళం విప్పుతామని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. వైద్యకళాశాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ రానున్న 15 రోజుల్లో హామీ నెరవేర్చకపోతే తాను ఆరు రోజులపాటు దీక్ష చేస్తానని చెప్పారు. హైదరాబాద్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

తమ ప్రభుత్వం ఉంటే సులువుగా సమస్యలు పరిష్కారమయ్యేవన్నారు. తెరాస ప్రభుత్వంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. తెరాస ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారిపోయారని.. అన్ని సమస్యలపై ప్రభుత్వాన్ని తాను నిలదీస్తానని చెప్పారు.  సంగారెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎంను కలవాలని భావించినా అనుమతి రాలేదని.. అసెంబ్లీ వేదికగానే సమస్యలను ప్రస్తావిస్తానన్నారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని