మీటర్లు బిగించే భాజపాకు ఓటేస్తారా?:హరీశ్‌రావు

తాజా వార్తలు

Published : 30/10/2020 01:23 IST

మీటర్లు బిగించే భాజపాకు ఓటేస్తారా?:హరీశ్‌రావు

దుబ్బాక: గత పాలకులు భూమి యజమానుల నుంచి శిస్తు వసూలు చేస్తే.. సీఎం కేసీఆర్‌ మాత్రం చరిత్ర తిరగరాసి రైతుబంధు ద్వారా డబ్బులు ఇచ్చారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనాపూర్‌, గుడికందుల గ్రామాల్లో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెరాస అని పేర్కొన్నారు. భాజపా రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్‌ ఇచ్చారా? అని ప్రశ్నించారు. గతంలో ఓట్ల కోసం వస్తే బిందెలు పెట్టి నీటికోసం మహిళలు ప్రశ్నించేవారని.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఉందా?అని ప్రశ్నించారు. సాధ్యం కాదనుకున్న గోదావరి జలాలను సిద్దిపేట జిల్లాకు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జిల్లా మంత్రిగా దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదేనని హరీశ్‌రావు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి సొంత స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు.  

‘‘కేంద్ర ప్రభుత్వం విదేశీ మక్కలు తీసుకొచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తోంది. రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తారంట. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు భద్రత లేకుండా పోయింది. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు బిగించే భాజపాకు ఓటేస్తారా? రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్న తెరాస కారు గుర్తుకు ఓటేస్తారా?ఇప్పటివరకు వ్యవసాయ పంపుసెట్ల వద్ద మీటర్లు తీసుకురావడం తప్ప తెలంగాణకు భాజపా చేసిందేమీ లేదు. గోబెల్స్‌ ప్రచారంతో ఓట్లు పొందాలని చూస్తున్నారు. అలాంటి పార్టీలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఉపఎన్నికలో మీ ఓట్ల ద్వారా భాజపాకు బుద్ధి చెప్పాలి’’ అని ప్రతిపక్షాలపై  హరీశ్‌రావు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని