‘జగన్‌ కేసులమాఫీ కోసమే పోలవరం తాకట్టు’

తాజా వార్తలు

Published : 27/10/2020 01:18 IST

‘జగన్‌ కేసులమాఫీ కోసమే పోలవరం తాకట్టు’

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ 

తణుకు: సీఎం జగన్‌ తన కేసుల మాఫీ కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా తణుకులో మీడియాతో ఆయన మాట్లాడారు. తెదేపా హయాంలో పోలవరం పనులు 70శాతం పనులు పూర్తయితే.. ఈ ఏడాదిన్నరలో కనీసం 2శాతం కూడా పనులు చేయలేదని విమర్శించారు. 

పోలవరం అంచనాలు తగ్గటానికి సీఎం జగన్, 22 మంది వైకాపా ఎంపీలే కారణమని లోకేశ్‌ ఆరోపించారు. ప్రత్యేక విమానంలో అనేకసార్లు ఎందుకు దిల్లీ వెళ్లి వచ్చారో తెలియకపోగా.. ప్రయాణానికి రూ.కోట్లు ఖర్చు చేసి రాష్ట్రానికి రూపాయి కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని