ఆ వ్యాఖ్యలు నన్ను బాధించాయి: సచిన్‌ పైలట్

తాజా వార్తలు

Published : 11/08/2020 15:57 IST

ఆ వ్యాఖ్యలు నన్ను బాధించాయి: సచిన్‌ పైలట్

దిల్లీ/జైపుర్‌: రాజకీయాల్లో అసూయ, వ్యక్తిగత శత్రుత్వానికి స్థానం లేదని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్ అన్నారు. తన మాజీ బాస్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ తనను పనికిరానివాడని దూషించినా, భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నానని ఆరోపించినా ఆయనను గౌరవిస్తానని సచిన్‌ తెలిపారు. ‘‘ఇతరులతో సహా, నా బద్ధ శత్రువులను నేను ఎంత వ్యతిరేకించినా వారిపట్ల నేను అలాంటి మాటలు ఉపయోగించను. అలాంటి విలువలను నేను నా కుటుంబం నుంచి పొందాను. అశోక్‌ గహ్లోత్ నా కంటే పెద్దవారు, వ్యక్తిగతంగా ఆయనను నేను ఎంతో గౌరవిస్తాను. పని, పాలనాపరమైన వ్యవహారాలలో నా అభిప్రాయాలను వ్యక్తపరచే హక్కు నాకు ఉంది. కానీ అశోక్‌ గహ్లోత్ గారి వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. వాటిపై ఇప్పుడు నేను స్పందించాలనుకోవడం లేదు. మాట్లాడేటప్పుడు సరైన భాషను ఉపయోగించాలి. ఇతరుల గురించి బహిరంగంగా మనం వ్యాఖ్యలు చేసేప్పుడు దానికి భాషాపరమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. గత ఇరవై ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఆ లక్ష్మణ రేఖను నేను ఎప్పుడూ దాటలేదు’’ అని అన్నారు.  

నెల రోజుల క్రితం అశోక్‌ గహ్లోత్‌తో విభేదించి, మరో 18మంది ఎమ్మెల్యేలతో తిరుబాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం కాంగ్రెస్‌ నేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో సచిన్‌ పైలట్ భేటీ అయ్యారు. తన వర్గం డిమాండ్లను వారు ఎంతో ఓపిగ్గా విన్నారని, వాటిని పరిష్కరిస్తామని మాట ఇచ్చినట్లు సచిన్‌ వెల్లడించారు. దీంతో రాజస్థాన్‌లో నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు నిన్నటితో తెరపడిన సంగతి తెలిసిందే. తాను చివర వరకు పార్టీలోనే కొనసాగనున్నట్లు కాంగ్రెస్‌ అధిష్ఠానంతో జరిగిన చర్చల అనంతరం పైలట్ ప్రకటించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని