రాహుల్‌.. ఇక మిగిలేది అదే: సంజయ్‌ ఝా

తాజా వార్తలు

Published : 25/08/2020 02:24 IST

రాహుల్‌.. ఇక మిగిలేది అదే: సంజయ్‌ ఝా

దిల్లీ: సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ప్రక్షాళన చేయాలని కోరుతూ పార్టీకి చెందిన 23 మంది నేతలు సోనియా గాంధీకి లేఖ రాయడంపై  రాహుల్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘భాజపాతో కుమ్మక్కై అధిష్ఠానానికి లేఖ రాశారు’ అని ఆయన మండి పడ్డారు. దీనిపై పార్టీ సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే గులామ్‌ నబీ ఆజాద్‌, కపిల్‌ సిబల్‌ తదితర ముఖ్యనేతలు రాహుల్‌ వ్యాఖ్యలపై గుర్రుగా ఉండగా.. తాజాగా ఆ పార్టీ బహిష్కృత నేత సంజయ్‌ ఝా రాహుల్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ‘‘డియర్‌ రాహుల్‌ గారూ.. మేమంతా భాజపాతో కుమ్మక్కైతే..ఇక మిగిలేది ‘బోరిస్‌ జాన్సన్ ఈజ్‌ ఏ‌ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో సంజయ్‌ ఝా కీలకంగా వ్యవహరించారు. 2013 నుంచి పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు  నిర్వర్తించారు. అయితే కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పిడి అవసరమంటూ ఇటీవల ఆయన వ్యాఖ్యానించడంతో వేటు పడింది.

తాము భాజపాతో కుమ్మక్కై అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినట్లు రుజువు చేసినట్లయితే పార్టీకి తక్షణమే రాజీనామా చేస్తామని సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌ తీవ్రంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్‌ పక్షానే నిలిచామని, మణిపూర్‌లోనూ భాజపాని గద్దె దించేందుకు పార్టీ పక్షాన పోరాడామని కపిల్‌ సిబల్‌ అభిప్రాయపడ్డారు. అయినా మేము భాజపాతో కుమ్మక్కయ్యామని రాహుల్ వ్యాఖ్యలు చేశారని ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా స్పందించారు.  రాహుల్‌ గాంధీ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. పార్టీలో అంతర్గతంగా గొడవపడే కంటే  మోదీ పాలనపై పోరాడాలని ట్విటర్‌లో పిలుపునిచ్చారు.ఆయన ఈ ట్వీట్‌ చేసిన కొద్ది సేపటికే కపిల్‌ సిబల్‌ తన ట్వీట్‌ డిలీట్‌ చేయడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని