AP News: ‘నవరత్నాలు కాదు.. నకిలీ రత్నాలు’
close

తాజా వార్తలు

Updated : 30/05/2021 14:36 IST

AP News: ‘నవరత్నాలు కాదు.. నకిలీ రత్నాలు’


అమరావతి: గత రెండేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘జగన్‌ రెండేళ్ల విధ్వంసం’ పేరిట 94 అంశాలతో కూడిన ఛార్జిషీట్‌ను ఆయన విశాఖలో విడుదల చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండిట్లోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు.  వైకాపా తీసుకొచ్చిన నవరత్నాలను నకిలీ రత్నాలుగా ఆయన అభివర్ణించారు. గతంలో తాము తీసుకొచ్చిన పథకాలకే పేర్లు మారుస్తున్నారన్నారు. రెండేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని, రాష్ట్రం నిరుద్యోగులకు నిలయంగా మారిందని ఆయన మండిపడ్డారు. ఏసీబీ, జేసీబీ, సీఐడీలతో పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘రెండేళ్ల వైకాపా పాలనలో ప్రత్యేక హోదా ఊసే లేదు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న హామీ ఏమైంది? రెండేళ్లలో రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందా? రాష్ట్రంలో యువతకు ఎన్ని కొత్త ఉద్యోగాలు వచ్చాయి.’’ అని అచ్చెన్నాయుడు నిలదీశారు.

వైకాపా నాయకులు 96 హామీలు అమలు చేశామని ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారనీ, మరో 4 తప్పులు చేస్తే 100 తప్పులు పూర్తి చేసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.  అమరావతి రాజధాని పూర్తయితే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే కుట్రతోనే మూడు రాజధానుల పేరు చెప్పి రాష్ట్ర ప్రజలను అయోమయంలోకి నెట్టేశారన్నారు. చంద్రబాబు హయాంలోనే పోలవరం ప్రాజెక్టు  74% పనులు పూర్తయిపోయాయని, రివర్స్ టెండరింగ్ పేరుతో రూ. 700 కోట్లు తగ్గించామని చెప్పి.. అక్రమంగా రూ.5,000 కోట్లు గుత్తేదారులకు కట్టబెట్టారని ఆరోపించారు. జూన్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న హామీ ఏమైందని అచ్చెన్న ప్రశ్నించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని