Lockdown పెట్టండి: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 04/05/2021 01:12 IST

Lockdown పెట్టండి: చంద్రబాబు

అమరావతి: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు చర్యలు చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వ్యాపించిన అతి ప్రమాదకర N440k రకం కరోనా వైరస్‌ రకం వేరే వాటికన్నా 10 రెట్లు ప్రభావం చూపుతోందన్నారు. వ్యాక్సినేషన్ కోసం ఇతర రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెడుతున్నా.. వైకాపా సర్కార్‌ మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కార్యాలయాలకు రంగుల కోసం రూ.3వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలని, వైద్య సిబ్బంది కొరత తీర్చేందుకు నియామకాలు చేపట్టి ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ సరఫరా పెంచాలని డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని