వీల్‌ఛైర్‌లోనే నేటి నుంచి దీదీ ప్రచారం..
close

తాజా వార్తలు

Updated : 14/03/2021 15:55 IST

వీల్‌ఛైర్‌లోనే నేటి నుంచి దీదీ ప్రచారం..

కోల్‌కతా: గాయం కారణంగా నాలుగు రోజుల పాటు ఆసుపత్రికే పరిమితమైన బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (66) మళ్లీ తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కాలికి గాయం ఉండటంతో వీల్‌ఛైర్‌లోనే తన ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతాలో భారీ రోడ్‌ షో నిర్వహించనున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ కాలికి గాయమైంది. కొందరు వ్యక్తులు కారు డోరును బలంగా తోయడంతో తన కాలికి గాయమైందని దీదీ పేర్కొన్నారు. దీని వెనక కుట్ర దాగి ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ప్రత్యేక పరిశీలకుల బృందం.. మమతా బెనర్జీపై ఎలాంటి దాడి జరగలేదని, ప్రమాదవశాత్తు ఆమె గాయాలపాలయ్యారని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించింది. ఘటన పథకం ప్రకారం జరిగింది కాదని తేల్చిచెప్పింది. ముఖ్యమంత్రికి అతి సమీపంగా  జనం తోసుకుంటూ వచ్చినా వారిని నియంత్రించడంలో పోలీసులు, భద్రతా సిబ్బంది విఫలయ్యారని నివేదికలో పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని