క్రేజీగా కేజ్రివాల్‌ ప్రచారం

తాజా వార్తలు

Updated : 13/01/2020 19:31 IST

క్రేజీగా కేజ్రివాల్‌ ప్రచారం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల సోషల్‌ మీడియా.. రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు పాత్ర పోషించాయి. అందుకే ఆయా పార్టీలతో నాయకులంతా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఇటీవల దిల్లీలో శాసనసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)తో పాటు కాంగ్రెస్‌, భాజపా ఎన్నికల్లో విజయం సాధించి దిల్లీ పీఠంపై కూర్చోవాలని తీవ్రంగా చెమటోడుస్తున్నాయి.

కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ అయితే మరింత చురుగ్గా వ్యవహరిస్తోంది. సామాజిక మాధ్యమాలను ప్రచారానికి వాడుకోవడంతోనే ఆగిపోకుండా ఒకడుగు ముందుకేసి ‘మెమ్స్‌’ తయారు చేస్తోంది. మెమ్స్‌ అంటే ఒక రకమైన స్పూఫ్‌. సందర్భానికి తగ్గట్లు ప్రముఖుల ఫొటోలు జతచేసి తమ అభిప్రాయం చెప్పేస్తుంటారు. వీటిపై యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. అందుకే ఆప్‌ సైతం మెమ్స్‌ మంత్రం పటిస్తోంది. ప్రధాన ప్రత్యర్థులైన భాజపా, కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని వాళ్ల లోపాలను ఎత్తి చూపుతూ.. ఆ పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు విసురుతోంది. ఇందుకు ట్విటర్‌, ఫేస్‌బుక్‌ను ప్రధాన వేదికగా చేసుకుంది. ఆప్‌ ట్విటర్‌ వేదికగా వేసిన మెమ్స్‌లో కొన్ని..

భాజపా పాలిత ప్రాంతాల్లో అవినీతి గురించి చదివేటప్పుడు ఓ భాజపా నేత రియాక్షన్‌ ఇలా ఉంటుందని ఆప్‌ ఇలా పోస్టు చేసింది.

దిల్లీ పీఠంపై ఎంతమంది కన్నేసినా మళ్లీ కేజ్రివాల్‌కే దక్కుందని చెప్పేందుకు.. ఈ పోస్టు..

దిల్లీలో భాజపా తరఫున సరైన సీఎం అభ్యర్థి లేరని చెప్పే ప్రయత్నం ఇది..

దిల్లీలో కేజ్రివాల్‌పై పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని చెప్పే మెమ్‌..

ఇదిలా ఉండగా.. ఈ ప్రచారంతో కొంతమంది యువతగా ఆకర్షితులవుతున్నా.. మరికొంత మంది మాత్రం స్వయంగా ఆప్‌ నిర్వహిస్తున్న సొంత ఖాతాలోనే ఇలాంటి వ్యంగ్యపు పోస్టులు పెట్టడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నిస్తున్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధులు, నాయకులు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడటం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని