కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించండి: థరూర్‌

తాజా వార్తలు

Published : 21/02/2020 00:33 IST

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించండి: థరూర్‌

దిల్లీ: పార్టీ కార్యకర్తల్లో శక్తి నింపేందుకు, ఓటర్లకు చేరువయ్యేందుకు అధ్యక్ష ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)ని ఆ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ కోరారు. పార్టీ అధ్యక్ష పీఠం గురించి ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ సందీప్‌ దీక్షిత్‌ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో పార్టీ సీనియర్లు విఫలమమయ్యారని ఆరోపించారు. పిల్లి మెడలో గంట కట్టేందుకు భయపడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో శశి థరూర్‌ ట్వీట్‌ చేశారు.

‘‘పార్టీ నేతలు దేశవ్యాప్తంగా అప్పుడప్పుడు ఏ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారో సందీప్‌ దీక్షిత్‌ అదే విషయాన్ని నిర్భయంగా చెప్పారు. నేను కూడా అదే అభ్యర్థిస్తున్నా. పార్టీ కార్యకర్తల్లో కొత్త శక్తిని నింపేందుకు సీడబ్ల్యూసీ వెంటనే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి’’ అని కోరారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్‌ గాంధీ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా వ్యవహరిస్తున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అంశంపై ఇంత వరకు ఆ పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయమూ వెలువడకపోవడంతో పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల దిల్లీ ఓటమికీ నాయకత్వ లేమి ఓ కారణమంటూ ఆరోపిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని