ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
close

తాజా వార్తలు

Updated : 03/03/2021 17:09 IST

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

అమరావతి: ఏపీలో పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాసేపట్లో పోటీలోని అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్ల పరిధిలోని 671 డివిజన్లు.. 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 2,123 వార్డులకు నామినేషన్ ప్రక్రియ గతేడాది మార్చిలోనే ముగిసింది. దీనికి సంబంధించిన నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ఈ మధ్యాహ్నం 3 గంటలతో పూర్తయింది. 

ఈనెల 10న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా.. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. విశాఖ, విజయనగరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం నగరపాలికలతో పాటు 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని