అందుకే భాజపాతో కలిసి వెళ్తున్నాం: పవన్‌

తాజా వార్తలు

Updated : 13/03/2021 14:40 IST

అందుకే భాజపాతో కలిసి వెళ్తున్నాం: పవన్‌

అమరావతి: తిరుపతి ఉపఎన్నిక ద్వారా వైకాపా ఆగడాలకు దీటైన సమాధానం చెప్పాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. భాజపా జాతీయ స్థాయి నేతలతో చర్చల తర్వాతనే తిరుపతి ఉపఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థిని బలపరిచినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతిలో విజయం కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. జనసేన అభ్యర్థి పోటీ చేయడం కంటే తిరుపతి అభివృద్ధే ముఖ్యమైనదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రగతి, శాంతి భద్రతల పరిరక్షణకు తాము తీసుకున్న నిర్ణయం మేలు చేస్తుందని పవన్‌ అన్నారు. అందరికీ ఆమోదయోగ్యుడైన, బలమైన అభ్యర్థి ఉన్నట్లయితే తప్పకుండా ఆ స్థానాన్ని భాజపాకు అప్పగిస్తామని మొదట్నుంచీ చెప్తూ వచ్చినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలోని ఆలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటి పరిరక్షణకు భాజపా తగు చర్యలు తీసుకుంటుందనే విశ్వాసం ఉందన్నారు. జనసేన పార్టీ తరఫున ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది సంస్థాగతంగా బలపడేందుకే అనే విషయాన్ని గమనించాలని కార్యకర్తలకు పవన్‌ సూచించారు. రాష్ట్రంలోని అరాచక శక్తులను ఎదుర్కొనేందుకే భాజపాతో కలిసి ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని