Raghurama: ర‌ఘురామ‌కు పెరుగుతున్న ఎంపీల‌ మ‌ద్ద‌తు

తాజా వార్తలు

Updated : 07/06/2021 14:34 IST

Raghurama: ర‌ఘురామ‌కు పెరుగుతున్న ఎంపీల‌ మ‌ద్ద‌తు

అమ‌రావ‌తి: ఏపీ సీఐడీ అధికారులు త‌న‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారంటూ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు స‌హ‌చ‌ర ఎంపీల‌కు రాసిన లేఖ‌ ప‌ట్ల ఆయ‌న‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఒడిశాలోని పూరి ఎంపీ, బిజూ జ‌న‌తాదళ్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత పినాకి మిశ్రా ర‌ఘురామ‌కు మ‌ద్ద‌తు తెలిపారు. సీఐడీ అధికారులు ర‌ఘురామ ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరును ఖండించిన ఆయ‌న.. గాయాల‌తో కూడిన ఎంపీ ఫొటోలు దిగ్భ్రాంతికి గురి చేశాయ‌న్నారు. అంత‌కుముందు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్‌, మండ్యా ఎంపీ సుమ‌ల‌త‌, కేర‌ళ ఎంపీ ప్రేమ్ చంద్ర‌న్, మ‌రో ఒడిశా ఎంపీ చంద్ర‌శేఖ‌ర్ సాహూ వంటి స‌హ‌చ‌రులు ర‌ఘురామ ప‌ట్ల ఏపీ సీఐడీ తీరును తీవ్రంగా ఖండించారు. ఒక పార్ల‌మెంటెరియ‌న్ ప‌ట్ల ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌ని.. పార్ల‌మెంట్‌లో ఈ అంశాన్ని లేవ‌నెత్తుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఎంపీపై దాడి బాధించింది: సంజ‌య్ జైస్వాల్‌

భాజ‌పా ఎంపీ, నీటి పారుద‌ల వ్య‌వ‌హారాల స్థాయి సంఘం ఛైర్మ‌న్ సంజ‌య్ జైస్వాల్ కూడా ర‌ఘురామ లేఖ‌పై స్పందించారు. ఎంపీపై దాడి త‌న‌ను బాధించింద‌ని వివ‌రించారు. ఘ‌ట‌న‌పై పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావిస్తాన‌న్నారు. ఈ విష‌యాన్ని మెయిల్ ద్వారా సంజ‌య్ జైస్వాల్ ర‌ఘురామ‌కు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని