ఎక్క‌డో భూములు చూపించి ఆరోపణలు: పల్లా 
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 10:41 IST

ఎక్క‌డో భూములు చూపించి ఆరోపణలు: పల్లా 

విశాఖ‌ప‌ట్నం: ఎక్క‌డో ఉన్న భూముల‌ను చూపించి త‌నవ‌ని చెప్పి ఆక్ర‌మ‌ణ‌ల ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని  తెదేపా నేత‌, మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక మండ‌లంలో నిన్న అక్ర‌మ నిర్మాణాల‌ను జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చేసిన విష‌యం తెలిసిందే. ఈ భూములు ప‌ల్లా కుటుంబానికి చెందినవ‌ని అధికార పార్టీ నేత‌లు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. 2014లో త‌న‌పై ఐటీ దాడులు జ‌రిగాయ‌న్నారు. త‌న‌కు భూములు ఎక్క‌డున్నాయో 2019 ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పొందుప‌రిచాన‌ని చెప్పారు. వైకాపాలో చేర‌నందుకే త‌నపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని