AP News: తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: అచ్చెన్న విమర్శ

తాజా వార్తలు

Published : 27/10/2021 14:15 IST

AP News: తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: అచ్చెన్న విమర్శ

అమరావతి: సీఎం జగన్ పాలనలో రైతుల ఇళ్లలో చీకటి నిండిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతు భరోసా కింద ఎన్ని నిధులు విడుదల చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. రూ.30 కోట్లు విడుదల చేసి.. రూ. 1,213 కోట్లు ఇచ్చినట్లు రైతుల్ని మోసగిస్తారా అని నిలదీశారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న జగన్‌ క్షమాపణలు చెప్పాలని అచ్చెన్న డిమాండ్‌ చేశారు. 64.06 లక్షల మందికి ఇవ్వాల్సిన  రైతు భరోసాను 45 లక్షల మందికే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులను జగన్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆక్షేపించారు. యంత్రసేవా పథకం పేరుతో రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక్క యంత్ర పరికరాన్ని ఇవ్వలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని