TS Politics: కేంద్ర మంత్రిగా రెండేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారు?: ఎర్రబెల్లి

తాజా వార్తలు

Updated : 21/08/2021 19:19 IST

TS Politics: కేంద్ర మంత్రిగా రెండేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారు?: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా కాకుండా అదనంగా తెలంగాణకు ఏం సాయం చేశారో.. గణాంకాలతో వెల్లడించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. మోదీ హయాంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచారని విమర్శించారు. మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని కేంద్రం ప్రశంసించిందని గుర్తు చేసిన ఎర్రబెల్లి.. దీనికి కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకపోవడంపై కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా రెండేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్‌ చేశారు.  



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని