TS politics: తెరాసలో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

తాజా వార్తలు

Updated : 30/07/2021 17:39 IST

TS politics: తెరాసలో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

హైదరాబాద్‌: ఇటీవల భాజపాకు రాజీనామా చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెరాసలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దిరెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా తెరాసలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘పెద్దిరెడ్డి నాకు సన్నిహిత మిత్రులు. రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో పెద్దిరెడ్డి చేదోడు వాదోడుగా ఉంటారు. చేనేత కార్మికులకు రైతు బీమా తరహా సౌకర్యం కల్పిస్తాం. రైతు బంధు, రైతు బీమా అమలుకు ఏడాది పట్టింది. రాష్ట్రంలో ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక అధికారి ఉన్నారు. రైతుల కుటుంబాలకు 10 రోజుల్లో బీమా అందుతోంది. సామాజిక వివక్షకు గురైన వారికి పకడ్బందీగా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఎస్సీ సంక్షేమ శాఖలోనూ రైతు బీమా తరహా ఏర్పాట్లు చేయాలి. తెలంగాణ  వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఉండేవి. ఎన్నో ఇబ్బందులు అధిగమించి ఇవాళ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం. అనేక విషయాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌ అని పార్లమెంట్‌లో కేంద్రం చెబుతోంది. వివిధ వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అత్యంత వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. గతేడాది రాష్ట్రంలో కోటి ఎకరాల భూమి సాగైంది. రాష్ట్రంలో 3కోట్ల టన్నుల వరి ధాన్యం పండింది. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రమే. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ కాశ్మీరఖండమే. దళితబంధు తెస్తామంటే విపక్షాలు అదిరిపడుతున్నాయి. ఆరునూరైనా దళతబంధు ఆగదు.. ఆపలేరు. వందశాతం అమలు చేసి తీరుతాం. ఆర్థిక పరిమితుల మేరకు దశలవారీగా అమలు చేస్తాం. రాష్ట్రంలో దళితుల సంఖ్య 18-19 శాతం ఉంటుంది. దళిత బంధు కోసం రూ.లక్ష కోట్లయినా ఖర్చు చేస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని