YSRCP: టెక్కలి వైకాపాలో బయటపడిన వర్గ విభేదాలు

తాజా వార్తలు

Updated : 24/09/2021 09:18 IST

YSRCP: టెక్కలి వైకాపాలో బయటపడిన వర్గ విభేదాలు

విప్‌ ధిక్కరిస్తే సస్పెండ్‌ చేస్తాం: ఎమ్మెల్సీ దువ్వాడ హెచ్చరిక

టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. నేడు జరగనున్న ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరిస్తే ఎంపీటీసీ సభ్యులతో పాటు రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పేరాడ తిలక్‌ను సస్పెండ్‌ చేస్తామని ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ దువ్వాడ శ్రీనివాస్‌ హెచ్చరించారు. గురువారం అర్ధరాత్రి ఓ వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు.

టెక్కలి నియోజకవర్గ పరిధిలోని నందిగాం మండలంలో 16 మంది ఎంపీటీసీ స్థానాలకు గాను.. అన్ని చోట్లా వైకాపా విజయం సాధించింది. అయినప్పటికీ వారిలో 11 మందిని కిడ్నాప్ చేసి వేరే ప్రాంతానికి తరలించారంటూ పరోక్షంగా పేరాడ తిలక్‌ను ఉద్దేశించి దువ్వాడ ఆరోపించారు. నియోజకవర్గంలో పరిస్థితిని పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డికి వివరించానని.. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే ఎంతటివారినైనా పార్టీ ఉపేక్షించొద్దని ఆయన సైతం స్పష్టం చేశారన్నారు. విప్‌ను ధిక్కరించిన వెంటనే ఎంపీటీసీ సభ్యులు తమ పదవిని కోల్పోతారన్నారు. తిలక్ సహా ఎంపీటీసీ సభ్యులందరూ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని