కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదా తాకట్టు: యనమల
close

తాజా వార్తలు

Published : 22/06/2021 13:45 IST

కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదా తాకట్టు: యనమల

అమరావతి: ఉద్యోగాల భర్తీ విషయంలో మోసం చేసినందుకు నిరుద్యోగ యువత, విద్యార్థులు జగన్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని తెలుగుదేశం సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్‌ అసత్యాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాల భవిష్యత్తు తరాలు ఉద్యోగాలు లేక తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. గోబెల్స్‌ ప్రచారం తరహాలోనే జగన్‌ విధానాలున్నాయని యనమల ఆక్షేపించారు. తన సొంత మీడియా గోబెల్స్‌ ప్రచార సాధనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌కు పట్టిన గతే వైకాపాకు పట్టనుందని దుయ్యబట్టారు. 

భాజపాకు కేంద్రంలో పూర్తి మెజారిటీ లేకుంటేనే ప్రత్యేక హోదా అడగగలం అని జగన్‌ చేసిన వ్యాఖ్యలు స్వలాభం కోసమేనని యనమల ధ్వజమెత్తారు. గట్టిగా పోరాడితే సాధ్యమయ్యే ప్రత్యేక హోదా అంశాన్ని తన కేసుల మాఫీ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. శాసనసభలో జగన్‌ చేసిన మండలి రద్దు తీర్మానం తెదేపాపై కక్షతో తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసింది కాదన్నారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నందుకు రద్దు నిర్ణయం తీసుకున్నారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదన్నది సుస్పష్టమని యనమల పేర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని