
ప్రధానాంశాలు
సీడబ్ల్యూసీలో నిర్ణయం
3 అంశాలపై తీర్మానాలు
ఈనాడు, దిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జూన్ కల్లా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవాలని వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించినట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈమేరకు జూన్‌లో కొత్త అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మరో నేత రణ్‌దీప్ సుర్జేవాలాతో కలిసి వేణుగోపాల్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి కొత్త తేదీలను త్వరలో ఖరారు చేస్తామన్నారు. అధ్యక్ష ఎన్నికతో పాటు, సీడబ్ల్యూసీకి కూడా ఎన్నిక జరుగుతుందని తెలిపారు. సోనియాగాంధీ అధ్యక్షతన పార్టీ వర్కింగ్ కమిటీ శుక్రవారం సమావేశం అయింది. ఈ సందర్భంగా రైతు ఉద్యమం, కొవిడ్ వ్యాక్సినేషన్, అధికార రహస్యాల లీకేజీ అంశాలకు సంబంధించి శుక్రవారం 3 తీర్మానాలు చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
అధ్యక్ష ఎన్నికపై భేటీలో వాగ్వాదం
దిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎప్పుడు ఎన్నిక నిర్వహించాలనే విషయమై సీడబ్ల్యూసీ సమావేశంలో కొందరు కీలక నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలు అధ్యక్ష పదవికి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనికి అశోక్ గహ్లోత్ స్పందిస్తూ అందుకు తొందరేమిటని ప్రశ్నించారు. పార్టీ నాయకత్వంపై వారికేమైనా అనుమానాలున్నాయా? అని ప్రశ్నించారు. గహ్లోత్ వ్యాఖ్యలపై ఆనంద్ శర్మ స్పందించారు. సోనియా, రాహుల్‌గాంధీలపై ఎవరికీ అనుమానాలు లేవని.. పార్టీలోని కొందరు నేతలను లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్‌లో ‘ట్రెండ్’గా మారిపోయిందని ధ్వజమెత్తారు. ఇంతలో సీనియర్ నేత అంబికా సోని కలుగజేసుకుని.. ‘గహ్లోత్ ఎవరి పేరును ప్రస్తావించలేదు’ అని గుర్తుచేశారు. చివరకు రాహుల్ గాంధీ జోక్యంతో ఈ వాదనలకు తెరపడింది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- పాపం ప్రియ.. షారుఖ్ తనయ..
- నేడు భారత్ బంద్
- స్టార్స్‌తో శ్రీముఖి.. ఫొటోలు వైరల్
- డిపాజిట్..నెలనెలా వెనక్కి...
- రివ్యూ: చెక్
- ఆటగాళ్లు నిజాయతీగా ఉంటే.. ఇదే ఒప్పుకుంటారు..
- కోడలిపై మామ లైంగిక దాడి
- పెళ్లిపై స్పందించిన విశాల్
- అయ్య స్పిన్నోయ్!