close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎమర్జెన్సీ విధింపు పొరపాటే: రాహుల్‌

దిల్లీ: దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో దేశంలో విధించిన ఆత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ) ముమ్మాటికీ పొరపాటేనని, ఆమె మనుమడు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. దేశ మాజీ ఆర్ధిక సలహాదారు, కార్నెల్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ కౌశిక్‌ బసుతో మంగళవారం జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో రాహుల్‌ ఈ విషయాన్ని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించడంతో పాటు రాజ్యాంగాన్ని అందించి, సమానత్వం కోసం నిలబడిన కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తిగా... పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నానని చెప్పారు. ఆత్యయిక స్థితి విధింపు గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..‘‘అది కచ్చితంగా పొరపాటే. మా నాయనమ్మ ఇందిరాగాంధీ కూడా ఆ విషయాన్ని అంగీకరించారు’’ అని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలను తన మనుషులతో నింపివేస్తోందని ఆరోపించారు. 2014 తర్వాత ప్రతిపక్ష పార్టీలు అధికార సాధన కోసం కాకుండా దేశం కోసం పోరాడుతున్నాయని రాహుల్‌ అన్నారు. భాజపాను ఓడించేందుకు దేశంలో పోరాడుతున్న వివిధ శక్తులన్నిటినీ కలుపుకొని వెళ్లేలా కాంగ్రెస్‌ పార్టీ మారాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు