ముందస్తు చర్యలు చేపట్టకే వ్యాధి ఉద్ధృతి: తమ్మినేని
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముందస్తు చర్యలు చేపట్టకే వ్యాధి ఉద్ధృతి: తమ్మినేని

రెడ్డికాలనీ(మిర్యాలగూడ), న్యూస్‌టుడే: దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ విజృంభణకు మోదీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డితో కలిసి మాట్లాడారు. రెండో దశ వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినప్పటికీ ఎటువంటి  చర్యలు చేపట్టకపోవడంతో వ్యాధి ఉద్ధృతమై ఇప్పుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నామన్నారు. కేవలం 33 కోట్ల జనాభా ఉన్న అమెరికా వంటి దేశాలు సుమారు 260 కోట్ల టీకా డోసులు నిల్వ ఉంచుకుంటే.. 139 కోట్ల మంది ఉన్న మన దేశంలో ఇప్పటి వరకు 11 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ అందించారని విమర్శించారు. స్వార్థం కోసం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, కుంభమేళా వంటివి నిర్వహించి వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రాన్ని నిలదీయడంలో.. ముందస్తు చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు