TS News: ఈటల ఓడిపోవడం ఖాయం: గుత్తా
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: ఈటల ఓడిపోవడం ఖాయం: గుత్తా

ఈనాడు, నల్గొండ: రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలే ఉంటాయని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారంతో పాటు సమకాలీన అంశాలపై ఆయన నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో గురువారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘ఈటల రాజేందర్‌కు కేసీఆర్‌ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయినా తన రాజకీయ భవిష్యత్తును ఆయన నాశనం చేసుకున్నారు. ఆయన భాజపాలోకి ఆత్మరక్షణ కోసం కాకుండా ఆస్తుల రక్షణ కోసమే వెళుతున్నారు. త్వరలో అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఖాయం. మరో ఇరవై ఏళ్లు తెరాస అధికారంలో ఉంటుంది. స్వరాష్ట్రంలోనే వ్యవసాయం అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. దేశ వ్యాప్తంగా మోదీ గ్రాఫ్‌ పడిపోతోంది. 2026 సంవత్సరంలోనే నియోజకవర్గాల రిజర్వేషన్లు మారతాయి. రెండేళ్లలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడున్న రిజర్వేషన్ల ప్రకారమే జరుగుతాయి’’అని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు