గద్వాల తేర్‌ మైదాన్‌లో చర్చకు రండి

ప్రధానాంశాలు

గద్వాల తేర్‌ మైదాన్‌లో చర్చకు రండి

మంత్రి కేటీఆర్‌కు డీకే అరుణ సవాల్‌

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ గద్వాల సభలో చెప్పిన మాటలన్నీ అబద్ధాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. రాజీనామా చేయాల్సింది కేటీఆర్‌ కాదని.. సీఎం కేసీఆర్‌తో చేయించాలన్నారు. గద్వాలలో జరిగిన అభివృద్ధిపై చర్చకు కేటీఆర్‌ గద్వాల తేర్‌ మైదాన్‌కు రావాలని సవాల్‌ విసిరారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వాల్మీకి బోయ కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చే విషయమై కేంద్రానికి సిఫార్సు చేసినట్లు కేటీఆర్‌ అబద్ధాలు చెప్పారన్నారు. ఆ పత్రాలుంటే తన దగ్గరికి తెస్తే.. కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తానని చెప్పారు.
బీ సైదాబాద్‌లో చిన్నారిపై అఘాయిత్యం ఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహించనున్నట్లు భాజపా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌నాయక్‌ వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని