అచ్చెన్న.. నిమ్మలకు మైక్‌ కట్‌!

ప్రధానాంశాలు

అచ్చెన్న.. నిమ్మలకు మైక్‌ కట్‌!

రాబోయే రెండున్నరేళ్లూ ఇవ్వరట

ఏపీ శాసనసభ హక్కుల సంఘం తీర్మానం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా శాసనసభాపక్ష ఉప నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు ఇద్దరికీ వచ్చే శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ హక్కుల సంఘం తీర్మానించింది. దీన్ని రెండున్నరేళ్ల పాటు... అంటే ఈ శాసనసభ ఉన్నన్నాళ్లూ అమలుచేయాలని సిఫార్సు చేయనుంది. వచ్చే సమావేశాల్లో ఈ తీర్మాన ప్రతిని శాసనసభ ముందు ఉంచనున్నారు. ఈ చర్య తీసుకోవాలని వైకాపా ఎమ్మెల్యే వరప్రసాద్‌ ప్రతిపాదించగా, మరో ఎమ్మెల్యే విష్ణు బలపరిచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కమిటీ సభ్యుడు, తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ధ్రువీకరించారు. సభా హక్కుల సంఘం శాసనసభ కమిటీ హాలులో మంగళవారం సమావేశమైంది. ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. గతంలో శాసనసభలో చర్చ సందర్భంగా మద్యం దుకాణాల సంఖ్యపై సభా వేదికగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని అచ్చెన్నాయుడిపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అప్పట్లో ఫిర్యాదు చేశారు. పింఛన్ల సంఖ్య విషయంలో రామానాయుడిపై స్వయంగా సీఎం సభలోనే సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ఫిర్యాదులపై వారిద్దరూ సరైన వివరణ ఇవ్వనందున వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించినట్లు మాత్రమే కాకాణి మీడియాకు తెలిపారు. సభాపతి తమ్మినేని సీతారాంపై చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు విషయంలో అచ్చెన్నాయుడు గత సమావేశానికి వ్యక్తిగతంగా హాజరై విచారం వ్యక్తం చేశారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిటీ ఈ ఫిర్యాదును కొట్టేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని