దళితుడిని తొలి సీఎం చేయలేదేం?

ప్రధానాంశాలు

దళితుడిని తొలి సీఎం చేయలేదేం?

హుజూరాబాద్‌లో కేసీఆర్‌పై ఈటల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌, వీణవంక, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రజల ఓట్ల ద్వారా కేసీఆర్‌కు పదవి వచ్చిందని, అదే ప్రజలు త్వరలోనే ఆయనను గద్దె నుంచి దించేందుకు సిద్ధమవుతున్నారని హుజూరాబాద్‌ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బుధవారం ప్రచారంలో పాల్గొన్న ఆయన తెరాస ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. కేసీఆర్‌కు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేసేవారని అన్నారు. అలా చేయకుండా ఆయన కుటుంబంలో మాత్రం ఐదుగురికి పదవులు కట్టబెట్టుకున్నారని విమర్శించారు. దళిత బిడ్డలు తన సమావేశాలకు రాకుండా... వారు తన సమావేశాల్లో డప్పు కొట్టకుండా అధికారపార్టీ నేతలు ఆపుతున్నారని... దీనికి గుణపాఠం తప్పదని రాజేందర్‌ అన్నారు. దళితవ్యతిరేకి ఎవరనేది రాష్ట్ర ప్రజలకు తెలుసని...ఉపముఖ్యమంత్రి పదవుల్ని ఎస్సీలకు ఇచ్చినట్టే ఇచ్చి ఇద్దరికి తీసేశారని విమర్శించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని