భాజపా వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయ్‌: ఏచూరి

ప్రధానాంశాలు

భాజపా వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయ్‌: ఏచూరి

ఈనాడు, దిల్లీ: కేంద్రంలో భాజపాకు ప్రత్యామ్నాయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆ పార్టీ వ్యతిరేక శక్తుల ఏకీకరణ ప్రస్తుతం కొనసాగుతోందని పేర్కొన్నారు. దిల్లీలో మూడు రోజుల పాటు జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాజా సమావేశాల్లో తాము రాజకీయ తీర్మాన ముసాయిదాపై చర్చించినట్లు తెలిపారు. ఎన్నికల్లో పొత్తులపై స్పందిస్తూ.. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితుల ఆధారంగా అక్కడి తమ పార్టీ రాష్ట్ర కమిటీలు వాటిపై నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. గ్యాస్‌, పెట్రోలియం ఉత్పత్తులు, నిత్యావసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా త్వరలో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని