నేడు బండి సంజయ్‌ రైతు దీక్ష

ప్రధానాంశాలు

నేడు బండి సంజయ్‌ రైతు దీక్ష

వరి సాగుపై ప్రభుత్వ వైఖరికి నిరసన

ఈనాడు-హైదరాబాద్‌: వరి సాగుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గురువారం రైతు దీక్ష చేపడుతున్నారు. ‘‘వరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. అందుకే హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సంజయ్‌ దీక్ష కొనసాగుతుంది. దీనికి ‘వరి-ఉరి ప్రభుత్వ వైఖరి’ అని నామకరణం జరిగింది’’ అని పార్టీ వర్గాలు తెలిపాయి. తెరాస ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్ని విడనాడాలన్న డిమాండ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు సంజయ్‌ ఈ దీక్ష చేస్తున్నట్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని