close
పశువులకు గాలికుంటు టీకాలు!

న్యూస్‌టుడే, చాగలమర్రి

పశువులు గొర్రెలు, మేకలు, పందులు.. తదితర చీలిన గిట్టలుండే జంతువుల్లో సంభవించే తీవ్రమైన అంటువ్యాధి గాలికుంటు. ఈ వ్యాధి నివారణకు సకాలంలో టీకాలు వేయించకపోతే పశుపోషకులకు అధిక నష్టం వాటిల్లుతుందని ముత్యాలపాడు పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు డాక్టర్‌ సాయిబాబా (94935 50490) పేర్కొన్నారు. నేటి నుంచి మార్చి 16 వరకు ఒక నెలపాటు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ టీకాలు వేస్తారని తెలిపారు. ఈ వ్యాధి వైరస్‌ వల్ల వస్తుంది. ఈ వ్యాధి ఎప్పుడైనా సోకే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఎక్కువగా వర్షాకాలంలో, చలికాలంలో వ్యాప్తి చెందుతుంది. పశువుల నోటిలో, కాలి గిట్టల్లో పుండ్లు పడతాయి. కొన్నిసార్లు పొదుగు, నాలుకపై బొబ్బలు ఏర్పడతాయి. ఈ వ్యాధి గాలి ద్వారా ఇతర పశువులకు వ్యాప్తి చెందుతుంది. దీన్ని ప్రమాదకరమైన అంటువ్యాధిగా పరిగణిస్తారు.

ఈ వ్యాధి రాకుండా పశువులకు ముందస్తుగా.. ఎఫ్‌ఎండీ టీకా ఒకటి లేదా ఎఫ్‌ఎండీ, హెచ్‌ఎస్‌ టీకాలు రెండు లేదా ఎఫ్‌ఎండీ, హెచ్‌ఎస్‌, బీక్యూ టీకాలు మూడు కలిపి 2 మి.లీ. కండకు వేయాలి. దూడలు 6-8 వారాల వయసులో ఉన్నప్పుడు.. గాలికుంటు టీకా మొదటి డోస్‌ వేయాలి. 4-6 నెలల వయసులో టీకా బూస్టర్‌ డోస్‌ 2 మి.లీ. వేయాలి. ముందు జాగ్రత్తచర్యగా.. ఈ టీకాను ఏటా 6 నెలలకోసారి చొప్పున రెండుసార్లు వేయించాలి. తిరిగి సెప్టెంబరులో వేయించాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.