
తాజా వార్తలు
జడేజా ధనాధన్..ఆసీస్ లక్ష్యం 162
అర్ధశతకంతో రాణించిన కేఎల్ రాహుల్
ఇంటర్నెట్‌డెస్క్: రవీంద్ర జడేజా (44*; 23 బంతుల్లో, 5×4, 1×6) ధనాధన్ ఇన్నింగ్స్‌కు ఓపెనర్ కేఎల్ రాహుల్ (51; 40 బంతుల్లో, 5×4, 1×6) అర్ధశతకం తోడైన వేళ ఆస్ట్రేలియాకు భారత్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. కోహ్లీసేన ఆదిలోనే శిఖర్ ధావన్ (1) రూపంలో వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్లో గబ్బర్ను స్టార్క్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ (9)తో కలిసి రాహుల్ వేగంగా పరుగులు సాధించడంతో పవర్‌ప్లేలో భారత్ 42 పరుగులు సాధించింది. కాగా, ఏడో ఓవర్లో కోహ్లీని స్వెప్సన్ ఔట్ చేశాడు.
6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శాంసన్ (23; 15 బంతుల్లో, 1×4, 1×6)తో పాటు కేఎల్ రాహుల్ ధాటిగా ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. లాఫ్టెడ్ షాట్లతో వీరిద్దరు బౌండరీలు బాదారు. కానీ ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఆరు పరుగుల వ్యవధిలోనే శాంసన్, మనీష్ పాండే (2), కేఎల్ రాహుల్ ఔటవ్వడంతో భారత్ 92 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్య (16; 15 బంతుల్లో, 1×6) ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయినా జడేజా విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి ధాటికి ఆఖరి మూడు ఓవర్లలో 46 పరుగులు వచ్చాయి. వాషింగ్టన్ సుందర్ (7) పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో హెన్రిక్స్ మూడు, స్టార్క్ రెండు, స్పెప్సన్, జంపా తలో వికెట్ తీశారు.
జడేజాకు గాయం!
బ్యాటింగ్ చేస్తున్న జడేజా 18వ ఓవర్లో తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి చికిత్స చేసిన అనంతరం అతడు బ్యాటింగ్ కొనసాగించినా స్వేచ్ఛగా కదలలేకపోయాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో అతడు బౌలింగ్ చేయడంపై సందేహాలు నెలకొన్నాయి.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- కంగారూను పట్టలేక..
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రెరా మధ్యే మార్గం
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- అభిమానుల దుశ్చర్య:సిరాజ్‌పై వ్యాఖ్యలు
- గబ్బా టెస్టు: ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 369
ఎక్కువ మంది చదివినవి (Most Read)
