close

తాజా వార్తలు

Published : 04/12/2020 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

10 జట్లతో ఐపీఎల్‌.. అదానీ, గోయెంకా ఆసక్తి!

బీసీసీఐ ఏజీఎంలో కీలక చర్చ

దిల్లీ: డిసెంబర్‌ 24న నిర్వహించే సాధారణ వార్షిక సమావేశంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులోకి మరో రెండు ఫ్రాంచైజీలకు అనుమతి, ఐసీసీలో భారత ప్రతినిధి ఎంపిక, ముగ్గురు జాతీయ సెలక్టర్ల ఎంపిక, బోర్డు ఉపాధ్యక్షుడి ఎన్నిక సహా మరికొన్ని అంశాలను ఇక్కడ చర్చించనున్నారు. ఇందులో భాగంగా 23 పాయింట్లతో కూడిన అజెండాను సమావేశానికి 21 రోజులు ముందుగానే సభ్య రాష్ట్రాలకు బీసీసీఐ పంపించింది.

ఈసారి ఏజీఎంలో పది జట్లతో కూడిన ఐపీఎల్‌ గురించే ప్రధాన చర్చ జరగనుంది. అదానీ గ్రూప్‌, సంజీవ్‌ గోయెంకా గ్రూపులు ఆ రెండు జట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. గతంలో గోయెంకా రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండింట్లో ఒక జట్టు కచ్చితంగా అహ్మదాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది.

జాతీయ సెలక్షన్‌ కమిటీకి ఇంకా ముగ్గురు సెలక్టర్లను ఎంచుకోవాల్సి ఉంది. అందులోనే చీఫ్‌ సెలక్టర్‌ను నియమించాల్సి ఉంది. మరో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తారు. 2021 ఏడాదికి గాను భారత భవిష్య పర్యటన ప్రణాళిక, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ, 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఐపీఎల్‌ పాలక మండలికి ఒక సభ్యుడిని ఎంపిక చేయనున్నారు. పది జట్లతో నిర్వహిస్తే ఐపీఎల్‌ మరికొన్ని రోజులు అదనంగా అభిమానులను అలరించడం గ్యారంటీ!


Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని