close

తాజా వార్తలు

Updated : 21/10/2020 21:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బెంగళూరు బౌలర్లు భళా! లక్ష్యం 85

20 ఓవర్లలో కోల్‌కతా 84 పరుగులే

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇయాన్ మోర్గాన్ (30; 34 బంతుల్లో, 1×4, 1×6) ఆదుకోవడంతో బెంగళూరుకు కోల్‌కతా 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. బెంగళూరు బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 84 పరుగులే చేసింది.  3/1.. 3/2.. 3/3.. 14/4.. 32/5.. 40/6.. 57/7.. ఈ గణాంకాలను చూస్తేనే తెలిసిపోతుంది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను బెంగళూరు బౌలర్లు ఏ రీతిలో బెంబేలెత్తించారో! క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కోల్‌కతాను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. సిరాజ్ (3/8)‌, మోరిస్‌ నిప్పులు చెరిగే బంతులు, చాహల్ (2/15), సుందర్ (1/14) మయాజాలానికి కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ లొంగిపోయారు. ఆఖర్లో ఫెర్గూసన్‌ (19*; 16 బంతుల్లో, 1×4), కుల్‌దీప్‌ యాదవ్ (12; 19 బంతుల్లో, 1×4) జాగ్రత్తగా ఆడటంతో కోల్‌కతా ఆలౌట్‌ కాకుండా తప్పించుకుంది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లో గిల్‌ (1), త్రిపాఠి (1), రాణా (0), బాంటన్‌ (10), దినేశ్‌ కార్తీక్‌ (4), కమిన్స్‌ (4) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లు నాలుగు ఓవర్లు మెయిడిన్‌ చేశారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.