
తాజా వార్తలు
అతడికే తుది జట్టులో అవకాశం: దాదా
ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌లో రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా అత్యుత్తమ వికెట్ కీపర్లని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొనియాడాడు. అయితే తుదిజట్టులో ఒక్క వికెట్‌కీపర్‌కు మాత్రమే స్థానం దక్కుతుందని, ఫామ్‌లో ఉన్న ఆటగాడికే ఆ అవకాశం లభిస్తుందని అన్నాడు. ‘‘భారత్‌లో పంత్, సాహా అద్భుతమైన వికెట్ కీపర్లు. పంత్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మునపటిలా విధ్వంసకర బ్యాటింగ్ చేస్తాడు. అతడో కుర్రాడు, మద్దతు అవసరం. అతడికి అపారమైన ప్రతిభ ఉంది. కాగా, తుదిజట్టులో ఫామ్‌లో ఉన్న ఒక్కరికే మాత్రమే చోటు దక్కుతుంది’’ అని దాదా తెలిపాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్, సంజు శాంసన్ ఎంపికవ్వగా.. టెస్టు సిరీస్‌కు వృద్ధిమాన్ సాహా, రిషభ్ పంత్ వికెట్ కీపర్లుగా స్థానం దక్కించుకున్నారు. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్లో కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేయగా, ఆలస్యంగా హైదరాబాద్ తుదిజట్టులోకి వచ్చిన సాహా చక్కని ఇన్నింగ్స్‌లు ఆడాడు. సంజు శాంసన్ మెరుపు ఇన్నింగ్స్‌లతో ఫర్వాలేదనిపించగా, పంత్ టోర్నీలో సత్తాచాటలేకపోయాడు. కానీ ముంబయితో జరిగిన ఫైనల్లో ఒత్తిడిలో పంత్ గొప్పగా ఆడాడు. 38 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. అయితే ఆసీస్ పిచ్‌లపై ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రభావం చూపిస్తాడని భావిస్తే సాహాకు బదులుగా పంత్ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా తొలి వన్డే శుక్రవారం జరగనుంది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- అందరివాడిని
- సాహో భారత్!
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- కొవిడ్ టీకా అలజడి
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
