ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్న రోహిత్‌?

తాజా వార్తలు

Updated : 07/12/2020 15:50 IST

ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్న రోహిత్‌?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ చివరి రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్‌ 11న బెంగళూరులోని ఎన్‌సీఏలో అతడికి ఫిట్‌నెస్‌ పరీక్షలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే రోహిత్‌ మరుసటి రోజే ఆస్ట్రేలియా విమానం ఎక్కే అవకాశముంది. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న హిట్‌మ్యాన్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడని, అతడి పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌ 12న ఆసీస్‌కు పయనమవుతాడని చెప్పారు.

రోహిత్‌ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తర్వాత 14 రోజుల క్వారంటైన్‌ అనంతరం టీమ్‌ఇండియాతో కలుస్తాడు. ఆపై వారం రోజులు ప్రాక్టీస్‌ చేసి జనవరి 7 నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టులో బరిలోకి దిగుతాడని ఆ అధికారి వివరించారు. ఇదిలా ఉండగా, రోహిత్‌ ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఆడేటప్పుడు తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు లీగ్‌ మ్యాచ్‌లు ఆడని అతడు తర్వాత ప్లేఆఫ్స్‌, ఫైనల్‌లో అదరగొట్టాడు. అదే సమయంలో బీసీసీఐ విడుదల చేసిన ఆస్ట్రేలియా పర్యటన జట్లలో రోహిత్‌ పేరు లేదు. అనంతరం పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అతడిని టెస్టు సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే, రోహిత్‌ దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియా వెళ్లకుండా తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. ఈ అంశంపై బీసీసీఐ స్పందిస్తూ.. రోహిత్‌ వ్యక్తిగత కారణాలతో ఇక్కడికి వచ్చినట్లు స్పష్టం చేసింది. అనంతరం హిట్‌మ్యాన్‌ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీకి చేరుకొని పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేందుకు కసరత్తులు చేస్తున్నాడు.

ఇవీ చదవండి..

రోహిత్, బుమ్రా లేకుండా సిరీస్‌ గెలిచాం: కోహ్లీ

ఏడాదిగా కోహ్లీసేన జైత్రయాత్ర..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని