close

తాజా వార్తలు

సెలక్టర్ల పోటీలో శివ రామకృష్ణన్‌, బంగర్‌!

ముంబయి: భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ జాతీయ సెలక్టర్‌ పదవికి దరఖాస్తు చేశారు. ఆయనతో పాటు మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ రాజేశ్‌ చౌహాన్‌, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ అమే ఖురేషియా పోటీలో ఉన్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా ధ్రువీకరించారు. పదవులకు దరఖాస్తు చేసేందుకు జనవరి 24, శుక్రవారం చివరితేదీ. జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌, టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సైతం సెలక్టర్ల పదవులకు పోటీ చేయాలని భావిస్తున్నారని తెలిసింది. వారు రంగంలోకి దిగితే ఛైర్మన్‌ పదవికి త్రిముఖ పోరు నెలకొటుంది. 

సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్‌ (సౌత్‌ జోన్‌), గగన్ ఖోడా (సెంట్రల్‌ జోన్‌) పదవీకాలం ముగియనుంది. వీరి స్థానాల్లో బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ కొత్తవారిని ఎంపిక చేయనుంది. ఇక మిగతా సభ్యులు శరణ్‌దీప్‌ సింగ్‌ (నార్త్‌ జోన్‌), జతిన్‌ పరాంజపె (వెస్ట్‌ జోన్‌), దేవాంగ్‌ గాంధీ (ఈస్ట్‌ జోన్‌) మరో సంవత్సరం పాటు కొనసాగుతారు.

బెన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ప్రపంచకప్‌ గెలవడంతో శివ రామకృష్ణన్‌ది కీలకపాత్ర. ఆయన 20 ఏళ్లుగా క్రికెట్‌ వ్యాఖ్యానం చేస్తున్నారు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో స్పిన్‌ సలహాదారుగా పనిచేస్తున్నారు. ఐసీసీ క్రికెట్‌ కమిటీలోనూ భాగస్వామి. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌నూ బాగా చూస్తారు. ఆటగాళ్ల ప్రతిభను గుర్తించగలరు. యుజువేంద్ర చాహల్‌పై దృష్టి పెట్టాలని రవిశాస్త్రి, కోహ్లీకి సలహా ఇచ్చింది ఆయనే కావడం గమనార్హం. టీమిండియా తరఫున ఆయన 9 టెస్టులు, 16 వన్డేలు (మొత్తం 25 మ్యాచులు) ఆడారు.

మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ బంగర్‌ 12 టెస్టులు, 15 వన్డేలు (మొత్తం 27 మ్యాచులు) ఆడారు. వీరికన్నా ప్రసాద్‌ (33 టెస్టులు, 161 వన్డేలు) ఎక్కువగా ఆడాడు. అతడు జూనియర్‌ కమిటీ ఛైర్మన్‌గా రెండున్నర ఏళ్లు పనిచేయడంతో నిబంధనల ప్రకారం సెలక్టర్‌గా ఆయనకు ఇంకా ఒకటిన్నర సంవత్సరమే అవకాశం ఉంటుంది. ఇక చౌహాన్‌ భారత్‌ తరఫున 21 టెస్టులు, 35 వన్డేలు ఆడాడు. 1990ల్లో అనిల్‌కుంబ్లే, వెంకటపతి రాజుతో కలిసి ఆడాడు.

ఇవీ చదవండి...

సైని, బుమ్రా బౌలింగ్‌లో రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌

శుభ్‌మన్‌ను ఎప్పుడు కెప్టెన్‌ చేస్తున్నారు?

కివీస్‌పై పగా? మంచోళ్లను ప్రేమిస్తాం డూడ్‌!


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.